Vellulli : వెల్లుల్లిని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..

Vellulli : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు పెద్దలు. ఉల్లిపాయ మాత్రమే కాదు వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలామంది వెల్లుల్లి తినడానికి కొంచెం అఇష్టం చూపుతారు. ఎందుకంటే వెల్లుల్లి రుచికి చాలా ఘాటుగా ఉంటుంది. మరి వెల్లుల్లిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి అనేక ఆరోగ్య మరియు ఔషధ గుణాలు కలిగి ఉంది. వెల్లుల్లి ఎలాంటి వ్యాధులను శరీరంలో ప్రవేశించనియకుండా  రక్షణ కవచంలా పనిచేస్తుంది.  కాబట్టి వెల్లుల్లితో మీ ఆహారం యొక్క రుచి మరియు వాసనను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి అల్లియం కుటుంబానికి చెందినది. అల్లియం అనేది ఉల్లిపాయలు, స్కాలియన్లు, లీక్స్ మరియు షాలోట్‌లను కలిగి ఉన్న మొక్కల తరగతికి చెందినవి. వెల్లుల్లిని నిత్యం ఆహారంగా  తీసుకోవడం వలన మంచి పోషకాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని మరియు వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతుంది.  ఎందుకంటే వెల్లుల్లిలో అలిసిన్ మరియు ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు వంటి ఫైటోకెమికల్స్‌లో సమృద్ధిగా ఉంటుంది.

Vellulli uses in telugu take on empty stomach
Vellulli

వెల్లుల్లి యొక్క ప్రయోజనాల గురించి  వైద్యపరంగా అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించబడ్డాయి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. వెల్లుల్లిలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి సీజన్ల‌ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అందుకే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల్లో వెల్లుల్లి కూడా ఒకటి అని చెప్ప‌వచ్చు. అలాంటి వెల్లుల్లిని మనం సీజనల్ గా కాకుండా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున చర్మం మెరిసేందుకు దోహదపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దేహంలోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహకరిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచి వృద్ధాప్య ఛాయలను ద‌రిచేరనివ్వదు.

Share
Mounika Yandrapu

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago