Vellulli : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు పెద్దలు. ఉల్లిపాయ మాత్రమే కాదు వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలామంది వెల్లుల్లి తినడానికి కొంచెం అఇష్టం చూపుతారు. ఎందుకంటే వెల్లుల్లి రుచికి చాలా ఘాటుగా ఉంటుంది. మరి వెల్లుల్లిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి అనేక ఆరోగ్య మరియు ఔషధ గుణాలు కలిగి ఉంది. వెల్లుల్లి ఎలాంటి వ్యాధులను శరీరంలో ప్రవేశించనియకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాబట్టి వెల్లుల్లితో మీ ఆహారం యొక్క రుచి మరియు వాసనను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి అల్లియం కుటుంబానికి చెందినది. అల్లియం అనేది ఉల్లిపాయలు, స్కాలియన్లు, లీక్స్ మరియు షాలోట్లను కలిగి ఉన్న మొక్కల తరగతికి చెందినవి. వెల్లుల్లిని నిత్యం ఆహారంగా తీసుకోవడం వలన మంచి పోషకాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని మరియు వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో అలిసిన్ మరియు ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు వంటి ఫైటోకెమికల్స్‌లో సమృద్ధిగా ఉంటుంది.
వెల్లుల్లి యొక్క ప్రయోజనాల గురించి వైద్యపరంగా అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించబడ్డాయి. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. వెల్లుల్లిలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి సీజన్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అందుకే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల్లో వెల్లుల్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. అలాంటి వెల్లుల్లిని మనం సీజనల్ గా కాకుండా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున చర్మం మెరిసేందుకు దోహదపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దేహంలోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహకరిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.