కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన వాటన్నింటిని ధీటుగా ఎదుర్కొంది. కొద్దిరోజుల్లోనే ఎంత మంచి రాష్ట్రానికి చేయవచ్చో, ఎంత మంది చింతలు తీర్చవచ్చో…చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. ప్రతికూలతల్లో అనుకూలతలను వెతికే నాయకత్వం ఉంటే, సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే నేతృత్వం లభిస్తే ఎలాంటి ఆపత్కాలాలనైనా దాటొచ్చని చాటింది. విజయవాడ వరదలను చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు, భారీ ప్యాకేజీతో బాధితులను ఆదుకున్న విధానమే దీనిని నిదర్శనం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వృద్ధుల పింఛన్లను ఒకేసారి రూ.వెయ్యి పెంచి రూ.నాలుగు వేలు చేశారు.
ఒకటో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. ఆగిపోయిన అన్న క్యాంటీన్లు తొలి వంద రోజుల్లోనే రాష్ట్రమంతా తెరుచుకున్నాయి. అమరావతి, పోలవరం పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ప్రజలకు కూటమి ప్రభుత్వం కలగించగలిగింది.అయితే వంద రోజుల కూటమి ప్రభుత్వంలో వెయ్యి అడుగులు వేశాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిపోయింది. ఐదేళ్లలో 3 శాతం గ్రోత్ రేట్ తగ్గింది. దీంతో బాగా వెనకబడ్డాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంది. రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ సమయంలో అధికారంలోకి వచ్చాం. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. పవన్‌కల్యాణ్, మంత్రులు, కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు చంద్రబాబు.
మూడు పార్టీల ఆలోచనలు విభిన్నమైనా ఒకటే ధ్యేయం.ఏపీ అభివృద్ధికి అంతా కలిసి ఉండాలి.ఈ పొత్తు శాశ్వతంగా ఉండాలి అని చంద్రబాబు అన్నారు. అభివృద్ధితో పాటు మన నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలి. భవిష్యత్‌లో చేసేవి కూడా మనం చెప్పాలి అని చంద్రబాబు అన్నారు. ఇటీవల వచ్చిన వరదలను కూడా సవాల్‌గా తీసుకుని పనిచేశాం. పవన్ రూ.6కోట్లు ఇచ్చారు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా జీవితంలో చాలా చాలెంజ్‌లు చూశాను. ఇప్పటికే రూ.350 కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌కి వచ్చింది. అందరం కలిసి నెల జీతం విరాళంగా ఇద్దాం అంటూ చంద్రబాబు పలు కామెంట్స్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…