Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొద్ది రోజులుగా పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడనున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆయన తాజాగా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు బాలినేని. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డికి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో నాలుగుసార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీకి అభ్యర్థి జనార్ధన రావును ఓడించారు.2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కింది. రెండేళ్లు అటవీ, పర్యావవరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2023లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…