వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జానీపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త జానీ అలాంటి వాడు కాదని.. కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపింది.16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటి? అంతకు ముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి.

మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నించింది. మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. ఆమె వర్క్ చేసిన ఇతర కొరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని వెల్లడించింది. అయితే గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు. అనంతరం అతనిని హైదరాబాద్ తరలించారు.

manchu manoj responded on jani master issue

ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు, అరెస్ట్ కావడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్. ‘జానీ మాస్టర్ మీరు ఎంతో కష్ఠపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మీరు ఎలాంటి అడ్డంకులను అధిగమించిన ఈ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై తీవ్రమైన ఆరోపణలు చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది ఒప్పో.. ఎవరిది తప్పుదో చట్టం నిర్ణయిస్తుంది. కానీ, ఒక మహిళకి సంబంధించిన కేసు విషయంలో మీరు పారిపోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని దీన్నిబట్టి తెలుస్తోంది. జానీ మాస్టర్ తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి. మీరు తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి.’అని పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 months ago