సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జానీపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన భార్య సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త జానీ అలాంటి వాడు కాదని.. కావాలనే కుట్ర చేస్తున్నారని తెలిపింది.16 ఏళ్లప్పుడు రేప్ జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటి? అంతకు ముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయి.
మిగతా కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్ లేదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నించింది. మైనర్ గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని చెప్తున్నది. ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అని సవాల్ చేసింది. ఆమె వర్క్ చేసిన ఇతర కొరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం జరిగిందన్న దానివి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవు అని జానీ భార్య ప్రశ్నించింది. ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి. బయటికి రమ్మనండి ఎక్కడో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు గదా అని వెల్లడించింది. అయితే గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు. అనంతరం అతనిని హైదరాబాద్ తరలించారు.
ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు, అరెస్ట్ కావడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్. ‘జానీ మాస్టర్ మీరు ఎంతో కష్ఠపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మీరు ఎలాంటి అడ్డంకులను అధిగమించిన ఈ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై తీవ్రమైన ఆరోపణలు చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది ఒప్పో.. ఎవరిది తప్పుదో చట్టం నిర్ణయిస్తుంది. కానీ, ఒక మహిళకి సంబంధించిన కేసు విషయంలో మీరు పారిపోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని దీన్నిబట్టి తెలుస్తోంది. జానీ మాస్టర్ తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి. మీరు తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి.’అని పేర్కొన్నారు.