politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుని రెప్పవాల్చినంతసేపు వెంకన్నను చూస్తే చాలు తమ కష్టమంతా మరిచిపోతారు భక్తులు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు.. తమ కుటుంబ సభ్యుల కోసం, తమ బంధుమిత్రులకు పంచడానికి లడ్డూలను వెంట తీసుకెళ్లారు. అలాంటి లడ్డూ ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ తయారుచేసిన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని, పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిసినట్లు ఆ పరీక్షలో వెల్లడైందని బోర్డ్ పేర్కొంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు.

pawan kalyan strong message to tirumala

తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు) కలిపినట్లు బయటపడిందని. ఈ విషయంలో అందరం తీవ్రంగా కలత చెందాం. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దీనిపై అవసరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇది రాష్ట్రంలోని ఆలయాలు, వాటి భూములు, ఇతర ధార్మిక విధానాలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి వచ్చింది అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మానికి ఏ ముప్పు వచ్చినా కలిసికట్టుగా పోరాడాలన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 months ago