politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర ప్రభుత్వం వంద రోజుల పాలనను పురస్కరించుకుని ఢిల్లీలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. చంద్రబాబు వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాలని కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న జేపీ నడ్డా..ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల విశ్వాసం మీద జరిగిన దాడిగా బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వ్యాపారం కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం దీనిపై విచారణ చేయాలని కోరారు. మ‌రోవైపు ఈ ఇష్యూపై స్పందించిన చంద్ర‌బాబు.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారు.

Chandra Babu angry on for using adulterated ghee in tirumala laddu
Chandra Babu

అన్న ప్రసాద వితరణలోనూ నాసిరకం ముడిసరకులు వాడారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. కక్కుర్తికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు. ఆధారాలు దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదు” అని సీఎం స్పష్టం చేశారు.అపవిత్ర ముడి సరకులు వాడిన విషయం ల్యాబ్ టెస్టుల్లో బయట పడింది. కక్కుర్తికి హద్దులుంటాయి.. కానీ హద్దులు దాటారు. రాజకీయ ప్రయోజనాలకు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వాడుకోవడం సరికాదు.రూ.350కి నెయ్యి వ‌స్తుందంటే ఆలోచించ‌రా.. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో బ్యారేజ్‌లోకి బోట్లు వ‌దిలారు. వీటన్నింటిని తేలుస్తాం అని చంద్ర‌బాబు పైర్ అయ్యారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 months ago