భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆయనను థానేలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాంబ్లీ వయస్సు 52 ఏళ్లు కాగా ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే వైద్యుల బృందం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు.
కాగా వినోద్ కాంబ్లీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన వారందరూ కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. అయితే ఇటీవలే ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అచ్రేకర్ శిష్యులు అయిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీల్ చైర్‌లో కూర్చున్న వినోద్ కాంబ్లీ పరిస్థితి చూసి అందరూ షాకయ్యారు. ఆయన సరిగ్గా లేచి నిలబడలేకపోయారు. కనీసం మాట్లాడలేకపోయారు.
దీంతో కాంబ్లీ దీన పరిస్థితి చూసిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆయనకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. సాయం అందుకునేందుకు కాంబ్లీ సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. రిహాబిలేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు తాను సిద్ధమేనని, అక్కడికి వెళ్లేందుకు తనకెలాంటి భయం లేదన్నారు. ఇంతలోనే కాంబ్లీ ఆస్పత్రి పాలు కావడం క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంబ్లీ త్వరగా కోలుకోవాలని మరోవైపు సచిన్ అభిమానులు కూడా ప్రార్థిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…