గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు.మద్యపాన నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన ఫైర్ అయ్యారు. గతంలో మద్యం దుకాణాల్లో సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారని జగన్ పై ధ్వజమెత్తారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యానికి సంబంధించి జే బ్రాండ్ రూపొందించారని అన్నారు. మల్టీ నేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారు మంత్రులు కొల్లు రవీంద్ర.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని వెల్లడించారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాగా, సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. సెబ్ పేరుతో వ్యవస్థను విధ్వంసం చేశారని అన్నారు. 70 శాతం ఉద్యోగులను వారి అక్రమ మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఉపయోగించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్స్ లేకుండా చేశారు.
నాసిరకం మద్యం తాగి చాలా మంది అనారోగ్యంపాలై మృత్యువాత పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై సీఎం ఆదేశాలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేసి బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేసిందన్నారు. 6 రాష్ట్రాల్లో నూతన పాలసీపై అధ్యయనం చేశామనీ చెప్పారు. మద్యం రేట్లు భారీగా పెంచడంతో చాలా మంది గంజాయికి అలవాటు పడ్డారని కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మందులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…