ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దేవర-పార్ట్ 1’ ఒకటి కాగా, దాంతో పాటు పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.అయితే ఆర్‌ఆర్‌ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవ్వడంతో ‘దేవర’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చకచక జరుగుతున్నాయి. యూఎస్ లో ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే వచ్చిన బజ్ నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ డాలర్ల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దక్కించుకుంది.
ఇప్పటికే ఆ నెంబర్ రెండు మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాలోనూ విపరీతమైన బజ్ ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షో లకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇంకో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా ఫీవర్‌తో ఊగిపోతున్నారు. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల అమితాసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘బుక్ మై షో’లోనూ ‘దేవర’ ఓ రికార్డును అందుకుంది.ఈ ఏడాది బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్న సినిమాగా ‘దేవర’ రికార్డ్ నెలకొల్పింది. బీఎంఎస్‌లో ఏకంగా 3.44 లక్షల మంది లైక్ కొట్టి, ఈ సినిమా పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. ఇప్పటిదాకా ‘పుష్ప-2’ ఈ ఏడాది అత్యధిక ఇంట్రెస్ట్స్ తెచ్చుకున్నే సినిమాగా కొనసాగుతూ వచ్చింది. దాని ఇంట్రెస్ట్స్ 3.34 లక్షల మేర ఉన్నాయి. ఈ మధ్య ‘పుష్ప-2’ టీం కూడా ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుంది.
కానీ ఆ సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది. ‘దేవర’ రిలీజ్ దగ్గర పడడంతో దానికి ఇంట్రెస్ట్స్ పెరిగిపోయి రికార్డును సొంతం చేసుకుంది. రిలీజ్ టైంకి దీని లెక్క ఎంత ఉంటుందో కానీ.. ‘పుష్ప-2’ విడుదల సమయానికి ‘పుష్ప-2’ మళ్లీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘దేవర’కు ఏపీ, తెలంగాణల్లో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ పర్మిషన్లు వచ్చేశాయి. ఏపీ సంగతి చూడాలి. అక్కడా ఆ షోలు ఖరారైతే యుఎస్ ప్రిమియర్స్‌తో పాటుగా ఇక్కడా ఒకేసారి షోలు మొదలవుతాయన్నమాట. ఇన్ని రోజులు హైయెస్ట్ ఇంట్రెస్ట్స్ ఉన్న టాలీవుడ్ సినిమాగా పుష్ప 2 ఉంటే ఇప్పుడు దేవర దీనిని క్రాస్ చేసి ప్రేక్షకులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమాగా నిలిచింది. దీనితో దేవర హవా ఆల్రెడీ ఓ రేంజ్ లో కొనసాగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…