జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్నారు. తాజాగా జగన్ చేసిన అయిదేళ్ల పాలనే రాష్ట్రానికి పెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రానికి అనుకోని విపత్తు వచ్చిన వేళ ప్రజలను మానవత్వంతో ఆదుకోవాల్సిన విపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుడప్పుడు బయటకు వచ్చి మేన్ మేడ్ ఫ్లడ్ అనడం జగన్‌కు అలవాటయిపోయిందని మండిపడ్డారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం కంటే మేన్ మేడ్ డిజాస్టర్ మరోకటి ఉండదన్నారు.
ఊహించని రీతిలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఇంత ఏడుపా అని ప్రశ్నించారు. జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్‌కు లేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ పాలనలో విపత్తులు వస్తే.. పవన్ కల్యాణ్ ఏనాడూ రాజకీయ విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. పిఠాపురంలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ కాలనీలు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని అన్నారు. ఎక్కడ కష్టమొచ్చినా జన సైనికులు ముందుంటున్నారని పేర్కొన్నారు.
లీడర్ అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లా స్పందించే మనసు ఉండాలి కాని, పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకుని జగన్ హడావుడి చేశారని విమర్శించారు. కాగితాలు చేతిలో పెట్టుకుని ఊగిపోతే.. షోమెన్ తప్ప.. లీడర్ అనిపించుకోలేరని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులను రూ.4కోట్లు వరద ప్రభావిత పంచాయతీలకు ఇవ్వడంతో పాటు రెండు రాష్ట్రాలకు రూ.2కోట్లు అందించారని గుర్తుచేశారు. ఏలేరు ఆధునికీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే.. వర్షాలు కురిశాయి కనుక పనులు చేయలేదని జగన్ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే దోరణిలో మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ హయాంలో బీమా సొమ్ములు ఎవరికీ ఇవ్వలేదని, క్షేత్రస్థాయిలో బీమా అందిన దాఖలాలు లేవన్నారు. జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అన్నారు మనోహర్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…