politics

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేయ‌డంతో దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఈ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చడం.. నిజంగా ఇది ప్రశంసనీయమైన చర్య.

pawan kalyan said he welcomes portblair name change

గత వలస వారసత్వ బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకోవడం ఓ మంచి పరిణామం. శతాబ్ధాల పాటు దేశాన్ని తీవ్రంగా అణివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే మీ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింపజేసేలా చేస్తుంది. వందల ఏళ్లపాటు ప్రాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, అటు వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ.. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడమనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా మీ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

19 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago

ఏపీ వ‌ర‌ద బాధితుల‌కు ల‌లితా జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ ఎంత స‌హాయం చేశారో తెలుసా..?

ఏపీలో వ‌ర‌ద‌లు సృష్టించిన వినాశ‌నం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. కొంద‌రు ఇప్ప‌టికీ దిక్కుతోచ‌ని స్థితిలో…

4 days ago