సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా తక్కువ కాలం పాటు కొనసాగుతారు. కానీ మంచి గుర్తింపు అనేది మాత్రం కొంతమంది హీరోయిన్లకే దక్కుతుంది. అలాంటి హీరోయిన్స్ లో రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు. శేఖర్ కమ్ముల తీసిన లీడర్ చిత్రంతో రానా దగ్గుపాటి హీరోగా పరిచయమయ్యారు. ఈ చిత్రంతోనే రిచా కూడా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
లీడర్ చిత్రం తర్వాత నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చాడు, మిర్చి, బాయ్ వంటి చిత్రాల్లో నటించింది. రీచాకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం రవితేజతో నటించిన మిరపకాయ్ అని చెప్పుకోవాలి. రిచా చివరగా 2013లో నాగార్జున నటించిన భాయ్ చిత్రంలో కనిపించింది. తెలుగుతోపాటు తమిళ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రిచా హీరోయిన్ గా కెరిర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయింది. తాజాగా రిచాకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
రిచా సినిమాలకు దూరమైన తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమించి పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకుంది. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రిచా . సినిమాలకు దూరమైనా కానీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తాజాగా రిచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. ఇందులో రిచా నీలం రంగు లంగావోణీలో భర్తతో కలిసి చూడముచ్చటైన జంటగా దర్శనమిచ్చింది. రిచా గంగోపాధ్యాయ పెళ్లయిన తర్వాత కాస్త బొద్దుగా మారింది. మనం చూస్తుంది మునుపటి రిచాయేనా అనేలా గుర్తుపట్టిన విధంగా మారిపోయింది. ప్రస్తుతం రిచా సినిమాలకు దూరంగా భర్తతో మరియు కొడుకుతో ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. రిచా ఫ్యామిలీ ఫోటోని చూసినా నెటిజెన్లు సైతం మేము చూస్తుంది మునుపటి రిచాయేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోకు గాను బ్యూటిఫుల్ ఫ్యామిలీ రిచా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…