మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఇదే విషయమై పాక్ మీడియా కోడై కూస్తోంది. అక్కడి నెటిజన్లు కూడా ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. అందుకనే విడాకులు తీసుకోబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం పాక్ మీడియాలో ఈ వార్త సెన్సేషనల్‌గా మారింది. ఈ క్రమంలోనే వారు ఇటీవల పెట్టిన పోస్టులే అందుకు సాక్ష్యమని కూడా చెబుతున్నారు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లది ప్రేమ వివాహం. వీరు 2010లో వివాహం చేసుకోగా.. ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఇటీవలే తమ కుమారుడి బర్త్ డే వేడుకలను కూడా వీరు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ క్రమంలో ఆ ఫొటోలను షోయబ్ మాలిక్ షేర్ చేశాడు. కానీ సానియా మీర్జా షేర్ చేయలేదు. పైగా బ్రోకెన్ హార్ట్.. అంటే.. పగిలిన హృదయం ఎమోజీని సైతం షేర్ చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని తెలుస్తోంది. ఇద్దరూ విడిపోయారని.. త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.
షోయబ్ మాలిక్ ఇటీవల ఓ అమ్మాయితో చనువుగా కనిపించడం వల్లే సానియా మీర్జా అతనికి దూరమైందట. ఈ మేరకు పాక్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా జరగడం వల్ల ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చి ప్రస్తుతం విడిగానే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అటు మాలిక్ కానీ.. ఇటు మీర్జా కానీ.. ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…