Blood : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో రక్త హీనత ఒకటి. శరీరంలో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల బలం తక్కువవడం, ఎటువంటి పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. కానీ పలు వంటింటి చిట్కాలతోనే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు.
మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే మన శరీరంలో అంత రక్తం ఉన్నట్టు లెక్క. సాధారణంగా పురుషులకు 13.5 నుంచి 16.5 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు అయితే 12 నుంచి 15 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి. మన శరీరంలో రక్తం పెరగాలంటే మన ఆహారంలో కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి.
మహిళలకు ప్రతి రోజు 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువగా ఐరన్ ఉండేలా చూసుకోవాలి. రక్తం త్వరగా పెరగాలి అంటే రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగాలి. పండ్ల రసాల కంటే క్యారెట్ జ్యూస్ మేలు. షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు.
ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోసలతో కూడా జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు. ప్రతి రోజూ తాగితే శరీరంలో రక్తం అమాంతం పెరుగుతుంది. ఒకవేళ గోధుమ గడ్డి పొడి దొరికినా దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగాలి. బత్తాయి జ్యూస్ కానీ, కమలం జ్యూస్ అయినా.. ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెరకు రసం తాగినా చాలు. పండ్ల జ్యూస్ లో తేనె, ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…