Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల్లో నటించడమే కాకుండా.. పార్టీతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఈయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయినప్పటికీ అలుపెరగని నేతగా శ్రమిస్తూనే ఉన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పవన్ కల్యాణ్‌కు అసలు ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. అన్న విషయానికి వస్తే..
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేశారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం అప్పటి వరకు ఆయన తనకు రూ.52 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. వాటిల్లో రూ.12.04 కోట్లు చరాస్తులు కాగా.. రూ.40.81 కోట్లు స్థిరాస్తులని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్కువగా ప్లాట్లు, ల్యాండ్స్‌ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇక తన మూడో భార్య లెజినివా పేరిట రూ.30.50 లక్షల చరాస్తులు ఉండగా.. అకీరా నందన్, ఆద్యల పేరిట రూ.1.51 కోట్లు, రూ.104 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే పవన్ తన వద్ద 312 గ్రాముల బంగారు, వ్రజాలు, ప్లాటినం ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు పలు ఖరీదైన కార్లు ఉన్నట్లు కూడా వెల్లడించారు. మెర్సిడెస్ బెంజ్ ఆర్ క్లాస్ ఆర్350, వోల్వో ఎక్స్‌సీ90, హార్లీ డేవిడ్‌సన్ హెరిటేజ్ సాఫ్టెయిల్ వంటి లగ్జరీ వాహనాలతోపాటు మహీంద్రా స్కార్పియో, స్కోడా ర్యాపిడ్, టొయోటా ఫార్చునర్ వాహనాలు పవన్ వద్ద ఉన్నాయి.
ఇక హైదరాబాద్‌కు సమీపంలోని శంకర్‌పల్లి అనే మండలంలో అలాగే ఏపీలోని గుంటూరు జిల్లాలో పలు చోట్ల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. దీంతో పవన్ పేరిట మొత్తం రూ.40.81 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పారు. ఇక పవన్‌కు రూ.33.72 కోట్ల అప్పు ఉంది. అందులో దర్శకుడు త్రివిక్రమ్ నుంచి తీసుకుంది రూ.2.40 కోట్లు ఉన్నట్లు తెలిపారు. కాగా పవన్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.9.60 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. అయితే ఈ లెక్కలు అన్నీ మూడేళ్ల కిందటివి కాగా.. ఇప్పుడు వపన్ ఆస్తి రూ.100 కోట్లు అయి ఉంటుందని అంటున్నారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…