Aratikaya Podi Kura : అరటికాయ పొడి కూర తయారీ ఇలా.. ఈ విధంగా చేస్తే.. ఇష్టంగా తింటారు..

Aratikaya Podi Kura : మనకు అందుబాటులో ఉన్న పలు రకాల కూరగాయల్లో కూర అరటి కాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని ఉపయోగించి సరైన రీతిలో కూర చేయాలేకానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే కూర అరటికాయలతో మనం పొడి కూరను కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కూర అరటికాయ పొడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..

కూర అరటికాయలు – 3, ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీస్పూన్‌, ఉప్పు – తగినంత, మసాలా ముద్ద కోసం – కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు, చింత పండు – చిన్న నిమ్మకాయంత, బెల్లం తురుము – ఒక టీస్పూన్‌, మసాలా పొడి కోసం – మినప పప్పు – 2 టీస్పూన్లు, ఎండు మిర్చి – 8, ధనియాలు – 2 టీస్పూన్లు, సోంపు – 1 టీస్పూన్‌, తాళింపు కోసం – ఆవాలు – ముప్పావు టీస్పూన్‌, కరివేపాకు రెబ్బలు – 4, నూనె – తగినంత.

Aratikaya Podi Kura very easy to make recipe
Aratikaya Podi Kura

కూర అరటికాయ పొడి కూర తయారు చేసే విధానం..

మసాలా పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి పక్కన పెట్టాలి. చల్లారాక పొడి చేయాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్న కొబ్బరిని కొద్దిగా వేయించాలి. గోధుమ రంగులోకి మారాక పక్కన ఉంచాలి. ఇప్పుడు దీనికి చింత పండు, బెల్లం తురుము, తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. అందులోనే మసాలా పొడి కూడా కలిపి ఉంచాలి.

ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కోయాలి. అరటి కాయల్ని ఉడికించి తొక్కు తీసి ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా ఉండేలా చిదమాలి. బాణలిలో నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు, మసాలా ముద్ద వేసి సిమ్‌లో పొడి పొడిగా అయ్యే వరకు వేయించి తీయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అరటికాయ పొడి కూర తయారవుతుంది. దీన్ని అన్నంతో వేరే ఏదైనా కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అరటి కాయ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago