Papaya : ఒకప్పుడు బొప్పాయి పండ్లు చాలా మంది ఇళ్లలో విరివిగా దొరికేవి. ఎంతో మంది తమ పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకొని వాటి ద్వారా వచ్చే బొప్పాయి పళ్లను తరచూ తింటూ ఉండేవారు. దీంతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో కేవలం మార్కెట్ నుండి మాత్రమే బొప్పాయిని కొనవలసి వస్తోంది. ఇక బొప్పాయి అనేది ఎన్నో పోషక విలువలతో నిండి ఉండటమే కాక దీని వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మీకు తెలుసా 150 గ్రాముల బొప్పాయి లో కేవలం 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పోషకాల పరంగా చూసినప్పుడు దీనిలో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, సి, ఇ, కె ఇంకా బి కి చెందిన విటమిన్లు అలాగే ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మెగ్నిషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఇంకా మాంగనీస్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇంకా బొప్పాయిలో అధిక సంఖ్యలో లభించే ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్స్ ఇంకా ఇతర యాంటీ ఆక్సీడెంట్లు, మూలకాలు వయసు మీద పడకుండా చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.
ఇక డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఒక రక్షణాత్మకమైన ఆహారంగా చెబుతారు. దీని సరైన గ్లైసెమిక్ ఇండెక్స్ వలన ఒక్కసారిగా షుగర్ స్థాయిలు పెరగడం అనేది ఉండదు. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్లు, యాంటీ ఆక్సీడెంట్లు జీర్ణాశయానికి మేలు చేయడమేగాక డయాబెటిస్ ఉన్న వారికి తగిన విధంగా సహాయం చేస్తాయి. అంతే కాకుండా బొప్పాయిలో లభించే ఫోలేట్ ఇంకా పొటాషియంలు రక్త నాళాల్లో అలాగే గుండెకు చేరే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బొప్పాయిలో ఉన్న విటమిన్ ఎ, విటమిన్ సి ఇంకా విటమిన్ ఇ లు రోగ నిరోధక శక్తిని సరైన విధంగా ఉంచుతాయి. దీని వలన జ్వరం, జలుబు, ఇన్ఫెక్షన్లు అలాగే వివిధ రకాల ఫ్లూ లు మన దరి చేరవు. బొప్పాయి పండులో పాపెయిన్, కైమో పాపెయిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని ప్రొటీన్లను అమైనో యాసిడ్లుగా మారుస్తాయి. ఈ అమైనో యాసిడ్లు పొట్టలోని ఇబ్బందులను ఇంకా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. పాపెయిన్ ఇంకా కైమో పాపెయిన్ లు శరీరంలోని వివిధ భాగాల్లో వాపులను, కొన్ని రకాల కీళ్ల వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ కె, కాల్షియం వలన ఎముకలు బలపడతాయి.
ప్రస్తుతం ఉన్న కాలుష్య పూరిత వాతావరణంలో బొప్పాయి తినడం వలన దీనిలో ఉండే విటమిన్ ఎ ఊపిరితిత్తులకు రక్షణగా ఉంటుంది. అలాగే పొగతాగే వారికి కూడా విటమిన్ ఎ లోపం ఉంటుంది. కాబట్టి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. బొప్పాయి పండులో లభించే విటమిన్ సి, ఇ అలాగే బీటా కెరోటిన్లు చర్మం ముడతలు పడడం, చర్మం పాడవడం లాంటి వాటిని తగ్గించి ఇంకా వయసు మీద పడడం వలన వచ్చే ఇతర చర్మ సమస్యలను రానివ్వదు. చర్మానికి మంచి రంగు అలాగే నిగారింపు వస్తుంది. అంతే కాకుండా దీనిలో ఉండే విటమిన్ ఎ వయసు మీద పడటం వలన వచ్చే వివిధ కంటి సమస్యలను కూడా రానివ్వదు. ఈ విధంగా బొప్పాయి పండుని రోజూ తీసుకోవడం వలన పైన చెప్పిన లాభాలను పొందవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…