Jathara Movie : సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత టాలెంట్ ను నిరూపించుకుని దర్శకులుగా ఎదిగినవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి దర్శకుల్లో దవళసత్యం కూడా ఒకరు. దాసరి నారాయణరావు వద్ద దవళసత్యం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా జాతర అనే సినిమాతో దవళసత్యం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఓ ఇంటర్వ్యూలో దవళసత్యం ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను దాసరి వద్ద చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని చెప్పారు. అంతే కాకుండా చిరంజీవితో ముందే ఓ సినిమా చేస్తానని చిరుకు మాట ఇచ్చానని చెప్పారు.
కానీ జాతర సినిమాకు అందరూ కొత్తవాళ్లే అని అన్నారు. తన నుండి మొదలుకుని నిర్మాత, సంగీత దర్శకుడు, కెమెరా మెన్ ఇలా అందరూ కొత్తవాళ్లేనని చెప్పారు. చిరంజీవిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం అందరికీ ఇష్టమేనని తెలిపారు. అయితే గురువుగారు దాసరి నారాయణరావు ఒకసారి తనతో అందరూ కొత్తవాళ్లు ఉన్నారు కదా చిరంజీవి స్థానంలో మరో కొత్త హీరోను తీసుకో అని సలహా ఇచ్చారని చెప్పారు. కానీ ఆ సినిమాలో హీరో పాత్రకు చిరంజీవి కరెక్ట్ గా సరిపోతాడని నమ్మకం ఉందని.. చిరు ముఖంలో ఏదో ఫెయిర్ ఉందని దాసరితో చెప్పానని అన్నారు. దాంతో దాసరిగారు ఏంట్రా ఆ నమ్మకం చిరంజీవి స్థానంలో చంద్రమోహన్ ను హీరోగా పెట్టుకో అని అన్నారని తెలిపారు.
కానీ తాను ఆ పాత్రకు చిరంజీవే న్యాయం చేయగలడని గురువుగారి మాట వినకుండా చిరంజీవితోనే సినిమా చేశానని చెప్పారు. అంతే కాకుండా జాతర సినిమా కథ.. రంగస్థలం సినిమా కథ ఒకటేనని అన్నారు. అయితే వాస్తవానికి రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఆ చిత్రం ఘన విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…