Green Gram : ప్రస్తుత తరుణంలో చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాధులు కొన్ని అయితే.. జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్న వ్యాధులు కొన్ని ఉంటున్నాయి. వ్యాధి అనేది ఎలా వచ్చినా సరే అందుకు మనం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే ఇలా వ్యాధులు రాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో.. అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా అంతే అవసరం. ఇక అన్ని పోషకాలు కలిగిన ఆహారాల విషయానికి వస్తే.. ఆ జాబితాలో పెసలు మొదటి స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పెసలలో ఉంటాయి. కనుక పెసలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
పెసలను రోజూ నీటిలో నానబెట్టి ఆ తరువాత వాటిని మొలకెత్తించి తినవచ్చు. లేదా నీటిలో నానిన అనంతరం ఉడకబెట్టి తినవచ్చు. ఎలా తిన్నా సరే.. రోజుకు ఒక కప్పు మోతాదులో వీటిని తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. పెసలను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారికి పెసలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటివి తగ్గుతాయి. ఇక పెసలను తింటే హైబీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది. షుగర్, థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
పెసలను తినడం వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. పెసలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కండరాల కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. దీంతో శరీరం దృఢంగా మారుతుంది. జిమ్ చేసేవారికి పెసలు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా పెసలతో ఎన్నో లాభాలు ఉంటాయి. కనుక రోజూ వీటిని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…