Antapuram Krishna Pradeep : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో 1998 లో తీసిన అంతః పురం మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమా వచ్చి 25 ఏళ్ళయింది. అయినా అందరి మదిలోనూ ఈ సినిమా మెదులుతుంది. అంతలా నటీనటుల నటన, దర్శక ప్రతిభ, సాంగ్స్ పిక్చరైజేషన్ అన్నీ సూపర్బ్‌గా వచ్చాయి. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణ ప్రదీప్ నటన తీసిపోనిది. కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, హీరోయిన్ సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడమే కాదు, ఉత్తమ సినిమాగా కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరొచ్చింది.
సౌందర్యకు స్పెషల్ జ్యూరీ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జగపతిబాబుకు, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా, స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ప్రకాష్ రాజ్ కు వచ్చాయి. అలాగే ఉత్తమ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలంగాణ శకుంతల, బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎస్.జానకి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా శ్రీనివాసరాజు, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తోట సాయి, ఇంకా చెప్పాలంటే సౌందర్య పాత్రకి డబ్బింగ్ చెప్పిన నటి సరితకు కూడా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు వచ్చాయి. సౌందర్య కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణప్రదీప్ నటన హైలెట్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో నటించే సమయానికి ఆ బాబుకి రెండేళ్ళ వయస్సు. అయినా సరే నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ లో మాస్టర్ కృష్ణప్రదీప్ పెర్ఫార్మెన్స్ కంటతడి పెట్టించింది. ప్రకాష్ రాజ్ ఫ్యాక్షనిస్టుగా బాబుని లాక్కుని ఆడించే సన్నివేశాల్లో సైతం కృష్ణ ప్రదీప్ అదరగొట్టాడు. ఇక స్టడీస్ దెబ్బతినకూడదని పేరెంట్స్ భావించి సినిమాల్లో ఇక నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు 24 ఏళ్ళ వయస్సులో చూడ్డానికి సినిమా హీరోలా మెరుస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే తనకు మొదట ఛాన్స్ ఇచ్చిన కృష్ణవంశీని ఆది గురువుగా చెబుతున్నాడు. మరి భవిష్యత్తులో సినిమాల్లో రాణిస్తాడేమో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…