ఈ మధ్య కాలంలో పోషకాహార లోపంతో బాధపడే పిల్లల సంఖ్య ఎక్కువవుతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో పిల్లలు ఎక్కువగా చిరుతిళ్లను తినడానికి అలవాటు పడి సరైన ఆహారాన్ని తినడం లేదు. పోషకాహార లోపం కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం కారణంగా పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యల్లో కంటి సమస్యలు కూడా ఒకటి.
పిల్లల ఆరోగ్యం వారికి మనం అందించే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఇచ్చే ఆహారంలో కోడిగుడ్లు ఉండేలా చూసుకోవాలి. కోడిగుడ్లల్లో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే సముద్ర చేపలను వాళ్లకి తరచూ ఆహారంలో భాగంగా ఇస్తూ ఉండాలి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యంతోపాటు రెటీనా కూడా చక్కగా పనిచేసేలా చేస్తాయి. అంతేకాకుండా కళ్లు పొడిబారకుండా కూడా ఉంటాయి.
అలాగే పిల్లలకు ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూరను ఆహారంగా ఇస్తూ ఉండాలి. వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లతోపాటు అనేక రకాల మినరల్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో వచ్చే కంటి సమస్యలతోపాటు మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో, వారిలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పిల్లలకు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వాలి. మామిడి, నారింజ, జామ, క్యారెట్ వంటి వాటిని వారికి ఇచ్చే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పిల్లలకు కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో పొద్దు తిరుగుడు విత్తనాలు ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ తోపాటు జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. పిల్లల్లో కంటిచూపును మెరుగుపరచడంలో నల్ల ద్రాక్ష కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలోని యాంథో సైనిన్స్ కంటిచూపును మెరుగుపరచడంతోపాటు కంటిలోని రెటీనాను కూడా రక్షిస్తాయి. కంటిచూపు సరిగా ఉండడంలో నీళ్లు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. పిల్లలు వారి వయస్సుకు తగినట్టు తగినన్ని నీళ్లు తాగేలా చూసుకోవాలి. అలాగే పిల్లలు ప్రతి రోజూ ఒక క్యారెట్ తినేలా చూసుకోవాలి.
ఈ ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో కంటిచూపు మెరుగుపడడమే కాకుండా పోషకాహార లోపం కూడా రాకుండా ఉంటుంది. వీటిని తినడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…