డిగ్రీ చదివి, అన్ని అర్హతలు ఉన్నా సరే కొందరు జాబ్ రాలేదని నిరాశ చెందుతుంటారు. ఇక కొందరు అయితే జాబ్ కోసం ఇంటర్వ్యూలకు ఎలా హాజరు కావాలా.. అని సందేహిస్తుంటారు. అర్హతలు ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే కొందరికి భయంగా ఉంటుంది. దీంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేక.. జాబ్ పొందలేకపోతుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే.. దాంతో ఎలాంటి భయం లేకుండా ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే ఇంటర్వ్యూల్లో సులభంగా సక్సెస్ అవుతారు. దీంతో జాబ్ కూడా వస్తుంది. ఇక అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్వ్యూలలో కామన్ గా అందరినీ అడిగే ప్రశ్న.. మీ గురించి మీరు చెప్పుకోమని అంటారు. ఇలా ప్రశ్న వేస్తే ఎలాంటి తొందర పాటు అవసరం లేదు. ఎందుకంటే.. వారు అడుగుతుంది, మీ గురించే కదా. మీ గురించి మీకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది. కనుక మీ గురించి మీకు తెలిసిన విషయాలను చాలా కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూయర్లకు చెప్పేయండి. దీంతో మీపై వారికి నమ్మకం వస్తుంది. పెద్దగా ప్రశ్నలు వేయకుంగానే ఇంటర్వ్యూను ముగించేందుకు ఇది తోడ్పడుతుంది. కనుక మీ గురించి చెప్పమన్నప్పుడు దానిపై మీరు కాన్ఫిడెంట్ గా చెప్పేందుకు యత్నించండి. జాబ్ మీదే అవుతుంది.
ఇంటర్వ్యూ అంటే అందులో మీరు ఒక్కరే కాదు, మీలా చాలా మంది అటెండ్ అవుతారు కదా. కనుక వారందరినీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తూ పోతే హెచ్ఆర్‌కు హెడేక్ వస్తుంది. వారు విసుగు చెందుతారు. కనుక మీ వంతు వచ్చినప్పుడు మీరు ప్రవర్తించే ప్రవర్తన పట్ల వారు విసుగు చెందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. వారిని మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు యత్నించండి. దీంతో వారికి మీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మీరు ఎలాంటి కఠినతర పరిస్థితిలో అయినా వర్క్ చేయగలరు అని ఇంటర్వ్యూయర్లు తెలుసుకుంటారు. దీంతో జాబ్ మీ సొంతమవుతుంది.
జాబ్ ఇంటర్వ్యూలలో వీలైనంత వరకు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు సింపుల్‌గా సమాధానాలు చెప్పండి. పెద్ద పెద్ద వాక్యాలు వాడకండి. క్లిష్టతరమైన, అర్థం చేసుకోలేని పదాలను వాడకండి. అలా వాడితే హెచ్ఆర్‌కు మీపై విసుగు పుట్టి మీ జాబ్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక సింపుల్‌గా ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేయండి.
మీ గురించి మీరు చెప్పేటప్పుడు మరీ అవసరం లేని విషయాలు చెప్పకండి. జాబ్‌కు సంబంధం ఉన్నవి, అందుకు గాను మీకున్న నైపుణ్యాలను మాత్రం చెబితే చాలు. అలా కాకుండా ఎక్కువగా చెబితే మీరే చిక్కుల్లో పడతారు. మీరు జాబ్ చేయాలనుకున్న కంపెనీ గోల్స్ గురించి ముందే తెలుసుకోండి. వాటి గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. అవే మీ గోల్స్‌గా నిర్ణయించుకోండి. వాటిని ఇంటర్వ్యూలో మీ గోల్స్‌గా చెప్పండి. అంతే.. ఇంటర్వ్యూయర్లు ఫ్లాట్ అవుతారు. మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది.
ఇంటర్వ్యూయర్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పండి. విసుగు చెందకండి. కోపం ప్రదర్శించకండి. అలా చేస్తే మీ జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు జాబ్ కోసం వచ్చిన కంపెనీలో మీకు వర్క్ అంటే ఎంత ఇష్టమో ఇంటర్వ్యూయర్లకు చెప్పండి. దీంతో వారు ఇంప్రెస్ అవుతారు. మీకు జాబ్ ఇస్తారు. ఏ విషయంపైనైనా అతిగా చెప్పకండి. ఇంటర్వ్యూయర్లు అడిగిన ప్రశ్నల మేరకు, అవసరం ఉన్నంత వరకే సమాధానం చెప్పండి. అతిగా సమాధానాలు చెబితే మీపై బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అది జాబ్ ఇవ్వకపోవడానికి కారణమవుతుంది. కనుక ఇంటర్వ్యూల్లో ఈ విధంగా చిట్కాలను పాటిస్తే జాబ్‌ను సులభంగా పొందగలుగుతారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…