Kallu : వేసవి వచ్చిందంటే చాలు.. మనకు అనేక రకాల సీజనల్ పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఇవి విరివిగా లభిస్తుంటాయి. ప్రస్తుతం వీటిని నగరాలు, పట్టణాల్లోనూ రహదారుల పక్కన విక్రయిస్తున్నారు. అయితే తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ముంజల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. పోషకాహార లోపం తగ్గుతుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.
తాటి ముంజల్లో బి విటమిన్లతోపాటు విటమిన్ సి, ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అనేక వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. తాటి ముంజలు చర్మానికి ఎంతో సంరక్షణను అందిస్తాయి. తాటి ముంజలపై ఉండే పొరను చెమట పొక్కులపై రాయడం వల్ల అవి తగ్గుతాయి. చర్మం చల్లగా మారుతుంది. వేడి నుంచి రక్షణ లభిస్తుంది. చర్మంపై వచ్చే దురద, దద్దుర్లు కూడా తగ్గుతాయి. అలాగే తాటి ముంజలతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని కూడా వాడవచ్చు. ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది. మృదువుగా మారుస్తుంది. తేమగా ఉంచుతుంది.
తాటి ముంజలు జీర్ణ సమస్యలను సైతం తగ్గించగలవు. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. అయితే అతిగా తింటే మాత్రం విరేచనాలు కలుగుతాయి. కనుక ముంజలను మోతాదులో తినాలి. ఇక వేసవిలో చాలా మంది తాటి కల్లు తాగుతుంటారు. కానీ దీన్ని ఉదయం 6 గంటల లోపు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని నీరా రూపంలో తాగితేనే మనకు మేలు జరుగుతుందట. అలా కాకుండా కల్లు తీసిన తరువాత ఆలస్యం అయ్యాక తాగితే పులుపు పెరుగుతుంది. అలాంటి కల్లును తాగితే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. అయితే కల్లు పులుపు ఎక్కకుండా తియ్యగా ఉండాలంటే దాన్ని తీయగానే ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో తాజాగా ఉంటుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరాను తాగవచ్చు. దీంతో వేసవిలో ఎంతో మేలు జరుగుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…