Apricots : ప్రస్తుత తరుణంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఈ సమస్య వస్తోంది. చిన్న వయస్సులోనే చాలా మందికి హైబీపీ వస్తోంది. దీంతో జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక్కో సందర్భంలో బీపీ నియంత్రణలో ఉండక గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. అయితే బీపీ నియంత్రణలో ఉండాలంటే.. డాక్టర్లు రాసిచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయాలి. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. ఫలితంగా బీపీ తగ్గుతుంది. ఇది పెద్ద సమస్య కానే కాదు.
ఇక బీపీని తగ్గించేందుకు యాప్రికాట్ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మనకు మార్కెట్‌లో డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తుంటాయి. వీటిని రోజుకు 2 తింటే చాలు.. ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తుంది. అలాగే కిడ్నీలను శుభ్రం చేస్తుంది. దీంతో వ్యాధులు రావు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రక్తనాళాల గోడలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ఫలితంగా బీపీ నియంత్రణలోకి వస్తుంది. కనుక యాప్రికాట్స్‌ను రోజూ తినాలి.
ఈ పండ్లను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్లను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్, మలబద్దకం వంటివి ఉండవు. ఇలా యాప్రికాట్ పండ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…