Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్‌లు ఎప్పటి నుంచో విడిగా ఉంటున్న విషయం విదితమే. వీరిద్దరూ అప్పట్లో ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకరి సోషల్ పోస్టుల్లో ఒకరు కనిపించేవారు. లైక్‌లు కొట్టుకునేవారు. కానీ 2021 నుంచి వీరు విడిపోయారని ప్రచారం జరుగుతోంది. వీరు విడాకులు తీసుకున్నారని.. అందుకనే దూరంగా ఉంటున్నారని అంటున్నారు. కానీ వీరి విడాకుల మ్యాటర్ అయితే ఇంత వరకు బయటకు రాలేదు. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ శ్రీజ తన పేరు చివర్లో కల్యాణ్ దేవ్ అనే పేరును తొలగించింది. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
ఇక కల్యాణ్ దేవ్ అప్పుడప్పుడు తమ కుమార్తె నవిష్కను మిస్ అవుతున్నట్లు పోస్టులు పెడుతున్నాడు. ఆమె శ్రీజ వద్దే ఉంటోంది. ఇద్దరూ విడాకులు తీసుకున్నాక కోర్టు నవిష్కను శ్రీజకు అప్పగించిందని.. అందుకనే ఆమె తన తల్లి వద్దే పెరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇద్దరూ విడిపోయారని.. విడాకులు తీసుకున్నారని.. ప్రచారం జరిగిందే తప్ప.. ఈ విషయాలు కన్‌ఫామ్ కాలేదు. కానీ వీరిద్దరి మధ్య విభేదాలు అయితే ఉన్నాయని తాజాగా బయట పడింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకున్నారు. దీంతో ఇద్దరికీ అసలు పడడం లేదని.. అందుకనే దూరంగా ఉంటున్నారనే విషయం మాత్రం తేలిపోయింది.
కాగా వాలెంటైన్స్ డే రోజు కల్యాణ్ దేవ్ ఏమని పోస్టు పెట్టాడంటే.. ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం.. అని ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా శ్రీజ.. ఒకరిని ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు.. అని శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టింది. దీంతో కల్యాణ్ దేవ్ పోస్టుకు కౌంటర్‌గానే ఆమె అలా పోస్టు పెట్టిందని అర్థమవుతోంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. అయితే వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారా.. లేదా.. అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
ఇక శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అలాగే కల్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవేవీ నిజం కాలేదు. ఇక కల్యాణ్ దేవ్, శ్రీజలు 2016లో వివాహం చేసుకోగా.. వీరికి 2018లో నవిష్క జన్మించింది. 2021 నుంచి వీరు దూరంగా ఉంటున్నారు. అయితే వీరి విడాకుల మ్యాటర్‌పై మాత్రం క్లారిటీ రావల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…