Shaakuntalam : నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంత చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఆమెకు ఊరటనిచ్చింది మాత్రం.. ఇటీవల వచ్చిన యశోద చిత్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకు ముందు ఆమె నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ తరువాత వచ్చిన యశోద మూవీతో సమంత మళ్లీ నిలదొక్కుకుంది. ఇక విడాకుల అనంతరం సమంత పుష్ప మూవీలో ప్రత్యేక సాంగ్‌లో కనిపించి అలరించింది. అయితే సమంత చేతిలో ఇప్పుడు ఇంకో మూవీ ఉంది. అదే.. శాకుంతలం. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
శాకుంతలం మూవీని దర్శకుడు గుణ శేఖర్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. కాళిదాసు రచించిన శకుంతల అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతలగా సమంత నటించింది. అలాగే మోహన్ బాబు, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కావల్సి ఉంది. కానీ ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా పడింది. దీంతో చిత్ర యూనిట్‌లో అయోమయం నెలకొంది. అయితే సమంత యశోద మూవీ తరువాత ఈ మూవీపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.
ఇక శాకుంతలం మూవీకి గాను సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గతంలో పుష్పలో ఐటమ్ సాంగ్ చేసినందుకే రూ.1.50 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా యశోద మూవీ హిట్ అయింది కూడా. దీంతో శాకుంతలం సినిమాకు ఆమె రెమ్యునరేషన్ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఆమె ఏకంగా రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తుందని తెలుస్తోంది. ఇక శాకుంతలం మూవీ రిలీజ్ కావాలని ఆమె ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. మరి ఏప్రిల్ 14వ తేదీన అయినా రిలీజ్ అవుతుందా.. లేక వాయిదా పడుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…