Chilli : ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది వాడుతున్న కూరగాయల్లో మిరపకాయలు కూడా ఒకటి. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జాతులకు చెందిన మిరపకాయలు మనకు లభిస్తున్నాయి. ఇవి కొన్ని కారం అదిరిపోయేలా ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి. ఇక పచ్చి మిర్చి, పండు మిర్చి, ఎండు మిర్చి.. ఇలా మిరపకాయలను వాడుతుంటారు. అయితే కారం ఉంటాయని చెప్పి మిరపకాయలను చాలా మంది తినేందుకు సందేహిస్తుంటారు. కానీ వీటిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మిరపకాయలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరపకాయలను తినడం వల్ల శరీరంలో ఎక్కడ ఏ నొప్పి ఉన్నా వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే మిర్చిలో ఉండే పలు సమ్మేళనాలు నొప్పిని తగ్గిస్తాయి. నొప్పికి సంబంధించిన సంకేతాలను మెదడుకు చేరనివ్వవు. దీంతో నొప్పి అనిపించదు. క్రమంగా నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే మిరపకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. షుగర్ ఉన్నవారికి మిరపకాయలు మంచి మందు అని చెప్పవచ్చు. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మన పెద్దలు చద్దన్నంలో రోజూ పచ్చి మిర్చిని నంజుకుని తినేవారు. అందుకనే వారికి షుగర్ లాంటి వ్యాధులు రాలేదు. కనుక మిర్చిని ఇలా తింటే షుగర్ నుంచి బయట పడవచ్చు.
మిర్చిని తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మిరపకాయలను తినడం వల్ల విటమిన్ సి, బీటా కెరోటీన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక మిరపకాయలను తింటే ఎలాంటి ముక్కు దిబ్బడ, జలుబు అయినా సరే వెంటనే తగ్గుతాయి. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం కరిగి బయటకు వస్తుంది. దీంతో శ్వాస సరిగ్గా ఆడుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడవచ్చు.
మిరపకాయలను తినడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీంతో రక్త సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఫలితంగా రక్తం గడ్డ కట్టదు. దీంతో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మిరపకాయలను తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా మిరపకాయల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక కారంగా ఉన్నా సరే మనం రోజూ వీటిని తినాల్సిందే. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…