Yutuber Nani : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన ఘటనలో యూట్యూబర్ నాని కీలక వ్యక్తిగా వ్యవహరించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాని ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు. అతడిని అరెస్ట్ చేసినట్టు అధికారిక సమాచారం లేకపోవడం, నాని కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సడన్ గా నాని బయటకు వచ్చారు. ఘటన జరిగిన రోజు తనను పోలీసులు తీసుకెళ్లారని లాఠీలతో కొట్టారని వివరించారు. తనను బూతులు తిట్టారని, ఎందుకు ఇలాంటి పని చేశావని అడిగారని చెప్పారు నాని. చివరకు కోర్టులో పిటిషన్ వేయడంతో తనను వదిలిపెట్టారని అన్నారు. మీడియా ముందుకు రావొద్దని, ఎవరితోనూ మాట్లాడొద్దని హెచ్చరించారని అన్నారు నాని.
కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నాడు. 19వ తేదీ రాత్రి తన భార్య సీమంతం కావడంతో వేరే ప్లేస్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చానని తెలిపాడు. అయితే, ఆ సమయంలోనే తనకు ఫోన్ రావడంతో యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్లనని చెప్పాడు. అయితే, తాను అక్కడికి వెళ్లే సరికి బోట్లు అన్ని తగలబడిపోతున్నాయన్నాడు. అది చూసి ఏడ్చుకుంటూ నేరుగా తన బోటు దగ్గరకు వెళ్లానని వివరించాడు. తనకు రెండు బోట్ల ఉన్నాయని వెల్లడించాడు. అందులో ఒకటి కాలిపోతుండగా.. ఇంకో బోటు సేఫ్ గా ఉందని తెలిపాడు. ‘నేను డ్రింక్ చేసింది వాస్తవమే అది నేను ఒప్పుకుంటాను. నా భార్య శ్రీమంతం కావడంతో నేను తాగాను. తాగిన మైకంలో ఉన్న నేను..తగలబడిపోతున్న బోట్లను ఎలా సేవ్ చేసేది? ఒకవేళ నేను సేవ్ చేయడానికి వెళ్తే మళ్లీ నన్ను సేవ్ చేయడానికి ఇంకోకరు రావాల్సి ఉంటుంది.
నేను ఉన్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు. ఈ ప్రమాదం జరిగిందని ఎవ్వరికి కూడా తెలియదు.. కనీసం వీడియో తీస్తే గవర్నమెంట్ కు తెలుస్తుంది.. ప్రజలు జరిగిన విషయం తెలుసుకుంటారు అని అలా చేశానని అన్నాడు. బోటులో మద్యం సేవిస్తున్న వాసుపల్లి నాని(23), అతని మామ అల్లిపిల్లి సత్యం ఈ ఘటనకు కారణమని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…