YS Sharmila : లోట‌స్ పాండ్‌లో బ‌తుక‌మ్మ ఆడిన ష‌ర్మిళ‌. ఫొటోలు, వీడియోలు వైర‌ల్..

YS Sharmila : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ.. ఆడపడుచులంతా సంబురంగా చేసుకునే వేడుక.. బంధాలు, అనుబంధాలను గుర్తు చేస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఓ అద్భుత పర్వం. ఎంగిళిపూలతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9రోజుల పాటు గౌరమ్మను పూజించే పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేస్తూ హోరెత్తించారు. రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మను పేర్చి గౌరమ్మను మధ్యలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయాలు, బొడ్రా యిల వద్ద మహిళలు బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. వైఎస్ ష‌ర్మిళ కూడా లోట‌స్ పాండ్‌లో మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆడిపాడింది. పాట‌లు పాడుతూ, స‌ర‌దాగా ఆట‌లు ఆడుతూ సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ష‌ర్మిళ‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ.. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఇది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో మమేకమై బతకాలని చల్లగా ఆశీర్వదించే పండుగ ఇది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆటాపాటాతో ఝల్లుమంది.

YS Sharmila participated in bathukamma program
YS Sharmila

ప్రకృతితో మమేకమై ఆడి పాడడమే బతుకమ్మ. పూలతో ప్రకృతిని పూజించడమే బతుకమ్మ పండుగ. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, సామాన్యులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు కూడా బ‌తుక‌మ్మ పండుగ‌తో బిజీగా ఉన్నారు. ఇక ష‌ర్మిల విష‌యానికి వ‌స్తే.. అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీపీ కీలక నేతలతో షర్మిల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై పార్టీ క్యాడర్‌తో చర్చిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago