Kamakshi Bhaskarla : ప్రస్తుతం టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. మా ఊరి పొలిమేర మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ చిత్రం మూఢనమ్మకాలు, చేతబడులు, అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 రాబోతోంది. రీసెంట్‌గా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఊరి పొలిమేర గుడిలోని మిస్టరీ, చేతబడులు అనే కాన్సెప్ట్ పైనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ లో దారుణం.. అసలు చేతబడులు నిజంగా ఉన్నాయా అనే టీవీ న్యూస్ ఛానెల్ వార్తలతో ట్రైలర్ మొదలవుతుంది.
ఈ సీక్వెల్ ని మాత్రం థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. నవంబర్ 3న మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ కానుంది. తొలి పార్ట్ ను మంచి సస్పెన్స్ తో ముగించిన మేకర్స్.. సీక్వెల్లో మాత్రం సైన్స్, మూఢనమ్మకం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తొలి పార్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజైంది. తొలి పార్ట్‌లో నటించిన సత్యమ్ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను, రవి వర్మలే ఈ సీక్వెల్లోనూ ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహబూబ్‌నగర్ లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింకేంటి అనేది తెలుసుకోవడానికి ఓ పోలీస్ అధికారి బయలుదేరతాడు. అతని వెంటే ఓ ఆర్కియాలజిస్ట్ కూడా వెళ్తాడు.
ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని ఛేదించడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తుంటారు. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చేశాయి. మా ఊరి పొలిమేర మూవీతో పోలిస్తే.. ఈ సీక్వెల్ ను కాస్త భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, మీనాక్షి మాట్లాడుతూ మిరపకాయ తీసినప్పుడు ప్లస్ 2 చదువుతున్నాను అని పేర్కొంది. అంటే హరీష్ శంకర్ ఏజ్ చాలా ఎక్కువ అన్నట్టు ఆమె మాట్లాడేసరికి అందరు ఆశ్చర్యపోయారు. మిరపకాయ సినిమా తనకెంతో నచ్చినట్టు అమ్మడు పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…