Tammareddy Bharadwaj : చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కొందరు ఆయనని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటూ మండిపడుతున్నారు. ఇంకొందరు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల ఇటీవల స్పందించిన బాలయ్య.. ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ కూడా చేశారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ సన్నిహితుడైన సినీ నటుడు రాజీవ్ కనకాల స్పందిస్తే… వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటం వల్లే చంద్రబాబు అరెస్టు విషయంపై ఎన్టీఆర్ స్పందించకపోయి ఉంటారని తాను భావిస్తున్నట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా, మధ్యలో కరోనా ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ కనీసం నాలుగు సినిమాలు చేసేవాడు. ప్రస్తుతం ఆయన ‘దేవర’లో నటిస్తున్నారు. అది చాలా పెద్ద సినిమా. పైగా రెండు భాగాలుగా వస్తోంది అని రాజీవ్ కనకాల చెప్పారు. నటన అంటే అతనికి ఎంతో ఇష్టం. దీంతో పూర్తి సమయం సినిమాకే కేటాయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపైనే దృష్టి పెట్టాలని భావించి ఉంటారని రాజీవ్ కనకాల తెలిపారు. ఇదే విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం సంబంధం అని .. అసలు ఆయన స్పందించాల్సిన అవసరం ఏముందని తమ్మారెడ్డి ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబం దూరం పెట్టిందని.. ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలని టీడీపీ చూసిందని తమ్మారెడ్డి తెలిపారు.
2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకుని అధికారంలోకి చూశారని..చంద్రబాబు పిలిచారని..ఆ ఎన్నికల్లో తన తాత స్థాపించిన పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేశారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ అవ్వడానికి కూడా టీడీపీనే కారణంగా ఆయన అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని 2014 ఎన్నికల్లో కావాలనే పార్టీకి దూరంగా పెట్టింది ఎవరని తమ్మారెడ్డి ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్‌ను కలుపుకోలేదని..అప్పుడు ఎన్టీఆర్ వస్తే తమకు టీడీపీలో చోటు ఉండదనే అభద్రత భావంతోనే ఆయన్ను పార్టీకి దూరం చేశారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరి ఆయన్ను కలిసిన చంద్రబాబుకు అప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ని వద్దని బయట వ్యక్తి కావాలన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించడం లేదని అడగడం ఎంతవరకు సరైందో చెప్పాలని తమ్మారెడ్డి మాట్లాడారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…