YS Sharmila : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు. అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లెళ్లు హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు.
గతంలో వైఎస్ జయంతి సందర్భంగా రిపీటైన సీనే అయినా కూడా ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఉన్నారు. కాని అది జరగలేదు.మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు. 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఇంకాబ్రతికే ఉన్నారన్నారు. వైఎస్ అద్భుతమైన పధకాలు ద్వారా కోట్లమంది ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు. రైతు పక్షపాతిగా ఉండి విద్యుత్ బకాయిలను మాఫీచేసి, ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన మహానేత అంటూ కొనియాడారు. మహిళలకు పావలా వడ్డీ ద్వారా ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపారన్నారు.
పేద విద్యార్దులకు ఏ చదువు చదవడానికైనా ఫీజ్ రీఏంబర్స్‌మెంట్ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపారన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పధకాలు అందించారన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండె ఆగిందన్నారు. వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ వైఎస్సార్ బిడ్డగా వారి త్యాగాలు మరిచిపోనని వైఎస్ షర్మిల తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…