Roja : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రదర్శించిన ఓ ఎర్ర రంగు అట్టతో ఉన్న పుస్తకం తెగ చర్చనీయాంశంగా మారింది. ఆ రెడ్‌బుక్ ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఎట్టకేలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఆ రెడ్‌బుక్ గుట్టు ఏమిటో బయటపెట్టారు.ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
నిబంధనలు ఉల్లంఘించి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న వారందరి పేర్లు ఈ రెడ్‌బుక్‌లో రాస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్‌బుక్‌లో నమోదు చేసిన అందరిపై న్యాయపరమైన విచారణ జరిపిస్తామని లోకేష్ చెప్పారు. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామన్నారు. సీఎం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారుల లెక్కతేల్చే పుస్తకమే ఇది అని బహిరంగ సభలో ఈ రెడ్‌బుక్‌ను చూపించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో లోకేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రెడ్ బుక్ పై తాజాగా రోజా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పంచ్‌లు వేసింది. నేను ఎర్రి పుష్పాన్ని అని చెబుతున్నట్టుగా ఉంది.మా నాన్న సీఎం అయిన కూడా నేను ఎంఎల్ఏని కాలేకపోయాను అని ఆయన బాధపడుతున్నట్టుగా ఉంది. నేను ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నట్టుగా ఆ బుక్ పట్టుకు తిరుగుతున్నాడు అని నాకు అనిపిస్తుంది అని రోజా అతనిపై విమర్శల వర్షం కురిపించింది. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…