Perni Nani : తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇప్పటివరకు తిన్న దానిలో దొరికింది 118 కోట్ల రూపాయలేనని, దొరక్కుండా ఎంత తిన్నాడో బయటికి వస్తుందని అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాడని ధ్వజమెత్తారు. అమరావతి కుంభకోణంలో దోచుకున్న రూ. 120 కోట్లు దొరికింది. దొరకని సొమ్ము ఎంత..? అమరావతి పేరుతో మొత్తం లంచాలకు తెరలేపారు. ఇలాంటి వ్యక్తి.. అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ అబద్ధాలు చెబుతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు జేశారు. నాటి అప్పులకు ఇవాళ పన్నులు కట్టే పరిస్థితి వచ్చింది” అంటూ పేర్ని నాని కామెంట్స్ చేశారు. జగన్-మోదీ, జగన్-భారతి, జగన్-విజయలక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నారో రాయగలిగే సత్తా కలిగిన ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు ఈ వార్తను ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడో ఏడాది క్రితం నోటీసులు ఇస్తే ఎవరికీ తెలియకుండా ఉందన్నారు. కనీసం హిందూస్థాన్ టైమ్స్‌లో ఇంత పెద్ద వార్త పడితే టీడీపీ అనుకూల మీడియా ఎందుకు రాయలేదన్నారు. కనీసం… చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు ఇస్తుందా? ఎంత ధైర్యం అని లేదా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెడిపోయిందని అయినా రాయాలి కదా అన్నారు. కానీ ఈ వార్తను వారు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
2014-19 మధ్య కాలంలో ఏపీలో కాంట్రాక్టులు నిర్వహించిన మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబునాయుడు రూ.118 కోట్ల రుపాయలు ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. నాలుగేళ్లుగా సాగుతున్న దర్యాప్తుకు చంద్రబాబు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఐటీ శాఖ ఆగష్టు 4న నోటీసులు జారీ చేసింది. ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…