Perni Nani : చంద్ర‌బాబు భ‌విష్య‌త్‌పై పేర్ని నాని సెటైర్స్

Perni Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు దిట్టని, కమ్యూనిస్టు, జెఎస్ పీలను వాడుకుని వదిలేశాడని విమర్శించారు. బీజేపీని గతంలో వాడుకుని వదిలేశాడని, మళ్ళీ అవసరం కోసం బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడని ఆయ‌న అన్నారు. చివరికి కాంగ్రెస్ ను కూడా వాడుకుని వదిలేశాడని పేర్కొన్నారు. ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు.. అవసరం తీరాక వెన్నుపోటు పొడుస్తాడు అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద ఉన్న రూ.118 కోట్లను నల్లదనంగానే ఐటీశాఖ గుర్తించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని టాక్ వినిపిస్తోంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదారిలో బోగస్ కాండ్రాక్ట్ ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి..తన ఖాతాలో జమ చేసుకున్నారని, ఇప్పుడు ఆ అవనీతి బాగోతం బట్టబయలైందని పేర్ని నాని అన్నారు. హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టలు చేసిందని, ఆ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 2016 నుంచి బాబు చేసిన భాగోతం ఇప్పుడు బయకొచ్చిందని, ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారని అన్నారు. అలానే రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని, ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది పేర్కొన్నారు.

Perni Nani comments on chandra babu future
Perni Nani

ఎన్టీఆర్ పైన ఉండి అన్ని చూస్తున్నారని విధి ఎవరిని వదిలిపెట్టదు అని అన్నారు. రాజకీయంగా జగన్ కు ఎన్టీఆర్ ఆశిస్సులు ఉన్నాయని వెల్లడించారు. ఐటీ నోటీసులు ఇచ్చింది వాస్తవమా కాదా చంద్రబాబు నోరు విప్పాలన్నారు.చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.రాజకీయ పార్టీలు పుడతాయని, కొన్ని అధికారం చేపడతాయి.. మరికొన్ని విలీనం అవుతాయి.. ఇంకొన్ని మూతపడతాయని తెలిపారు. జగన్ ప్రజా నాయకుడు.. జనం గుండెల్లో ఉన్నాడని ఎవరూ వచ్చినా జరిగేది ఏమీ లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు, నేతలు వస్తూ ఉంటారని పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago