Babu Mohan : నటుడిగా కొన్ని వందల సినిమాల్లో నటించిన బాబు మోహన్ తర్వాతికాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ముందు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన బాబు మోహన్ తరువాత అక్కడ టికెట్ నిరాకరించడంతో గులాబీ పార్టీలో చేరిన సంగతి కూడా తెలిసిందే. అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కామెడీ చేసిన తర్వాత బాగా కుదిరిన కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బ్రహ్మానందం – బాబు మోహన్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, పెదరాయుడు, పరదేశీ, అప్పుల అప్పారావు, జంబలకడిపంబ లాంటి సినిమాలు రాగా అన్ని దాదాపుగా సూపర్ హిట్ సినిమాలు గా నిలిచాయి. ఇక సినిమాల్లో మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి కూడా వచ్చారు.
ప్రస్తుతం కోటా శ్రీనివాసరావుకు వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కేవలం ఇంటర్వ్యూలలో మాత్రమే పాల్గొంటున్నారు. బాబు మోహన్ డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో బాబు మోహన్ కోటా గురించి, బ్రహ్మానందం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ…కోటా అన్నకు అసూయ ఎక్కువ.ఎవరైనా తనకన్నా ఎక్కువ ఉంటే తట్టుకోలేడు. నేను మంత్రి అయ్యాక వెనుక ఇద్దరు గన్ మెన్ లు వచ్చేవారు.ఆ సమయంలో అడపాదడపా షూటింగ్ చేసేవాడిని.
షూటింగ్ లో కూడా గన్ మేన్స్ వచ్చేవారు.ఇక వారిని చూసి అన్న ఏరా.గన్ మెన్ లా అంటూ పెదవి విరిచేవాడు.ఆయన మనసులో ఏం పడ్డది అంటే రాజకీయాల్లోకి వెళితే తనకు కూడా గన్ మెన్ లు ఉంటారని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తరువాత నా దగ్గరకు వచ్చి నాకు గన్ మెన్స్ ఉన్నారని చెప్పాడు.ఇక నేనెప్పుడూ అసెంబ్లీ మానేవాడిని కాదు.రోజు వెళ్లి వాళ్ళు చెప్పేది వినేవాడిని.కోటా అన్న ఎక్కడో ఒక మూల కూర్చునేవాడు.నేను నా ప్లేస్ లో కూర్చొనేవాడిని.అసెంబ్లీకి రావడం ఆలస్యం రారా నాపక్కన కూర్చో అనేవాడు.లేదన్నా నాకు అక్కడ ప్లేస్ ఉంది అంటే, ఏరా నా పక్కన కూర్చోకూడదా? మనం ఉన్నన్నిరోజులు ఒకే దగ్గర కూర్చుందాం అని చెప్పాడు.ఇక రోజు నేను కూడా అక్కడే కూర్చొనేవాడిని.
ఆ తరువాత నేను క్యాబినెట్ మంత్రిని అయ్యాను.అసెంబీలో మొదటి వరుసలో కూర్చోవాలి. నువ్వు ఎమ్మెల్యే నేను క్యాబినెట్ మంత్రి అక్కడే కూర్చోవాలి అంటే.ఎందుకురా మంత్రి పదవి మనం ఎమ్మెల్యేలుగా ఉంటే ఎంత బావుంటుందిరా అనేవాడు. కేవలం నాకు గన్ మెన్ లు ఉన్నారు.ఆయనకు లేరు అని వారికోసం రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పుకొచ్చారు . బ్రహ్మానందం గురించి బాబు మోహన్ మాట్లాడుతూ.బ్రహ్మానందం కనపడని కత్తి. ఎక్కడ కోశాడు.ఎలా కోశాడు అనేది తెలియదు. రక్తం రావడం మాత్రమే తెలుస్తుంది అని తెలిపారు బాబు మోహన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…