Yatra 2 Movie : ఇటీవల బయోపిక్స్ ఎక్కువగా రూపొందుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగులో కూడా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల బయోపిక్స్ ప్రేక్షకులని పలకరించాయి. మహి.వి రాఘవన్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం ఎంత విజయం సాధించిందో మనం చూశాం. చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించి మెప్పించారు.. 2019, ఫిబ్రవరి 8 న రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో వైసీపీకి ఎన్నికల్లో ప్రధాన ఆస్త్రంగా నిలిచిందని అంటారు.
ఇక ఇప్పుడు యాత్ర2 సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. 2024 ఎలక్షన్స్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘యాత్ర 2’ తెరపైకి తీసుకు రావాలని దర్శకుడు మహి వి. రాఘవన్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. యాత్ర వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో సాగితే.. ‘యాత్ర 2’ వైఎస్ జగన్ ప్రధానంగా సాగబోతుందని ఫిలిం నగర్ వర్గాలలో చర్చ నడుస్తుంది. అయితే యాత్ర 2లో నటించేది ఎవరనే దానిపై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. గతంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
తాజాగా జగన్ పాత్రలో ‘రంగం’ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జీవా నటిస్తాడనే టాక్ వినిపిస్తుంది. మహి వి రాఘవన్ ఇటీవల ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు టాక్.. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ పక్కగా పూర్తయిన తర్వాత వివరాలన్నీ అధికారికంగా తెలియజేస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మహి వి రాఘవన్. 2024 ఎన్నికలకు ముందే ఈ మూవీ కంప్లీట్ చేసి థియేటర్స్‌కి తీసుకొస్తారని అంటున్నారు. మరి ఇందులో ఏయే అంశాలు చూపిస్తాడు అని ముచ్చటించుకుంటున్నారు. మరి ఈ సినిమా రానున్న రోజులలో జగన్‌కి ఏమైన ఉపయోగపడుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…