పోలీస్ కాలర్ పట్టుకున్న మహిళ.. ఉద్రిక్తంగా మారిన ప‌రిస్థితి..

బ‌ద్వేలులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. జ‌గనన్న స్మా ర్ట్‌ సిటీ కోసం అధికారు లు దళితుల భూములను తీసుకున్నారు. ఇంత వరకూ ఎలాంటి నష్ట పరి హారం, ప్రత్యామ్నాయం చూపకపోగా పనులు ప్రారం భిస్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై టైర్లు, కంచెలు వేసి బైఠాయించారు.ఎలాంటి ప్రత్యా మ్నాం చూపకుండా పనులు ఎలా మొదలుపెడతారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదగొట్టే ప్రయ త్నం చేయగా దళితులు, మహిళలు వారిని వారించారు.

తమ భూములు అధికార పార్టీ నాయకులకు కేటాయిస్తే సహించేది లేదని దళితులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో జగనన్న స్మార్ట్‌ సిటీ భూములను చదును చేసేందుకు అధికారులు పూనుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గోపవరానికి చెందిన మాజీ కౌన్సిలర్‌, టీడీపీ నేత వక్కల సుబ్బరాయుడుతోపాటు పలువురిని ఆదివారం అరెస్టు చేసి బి.కోడూరుల‌ని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దళితులు బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారిలోని మడకలవారిపల్లెలో రోడ్డుపై బైఠాయించారు. తమ భూములు వేరేవారికి ఇవ్వమని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు.

woman pai polisula dadi in badwel

ఈ క్ర‌మంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు దళితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మ‌రోవైపు ఓ మ‌హిళ పోలీస్ కాల‌ర్ ప‌ట్టుకుంది. ప‌రిస్థితి ఉద్రిక‌త్తంగా మారుతున్న నేప‌థ్యంలో ఆందోళనకారులతో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, వైఎస్సార్‌ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె వద్ద అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (అడా) ఆధ్వర్యంలో జగనన్న స్మార్ట్‌సిటీ నిర్మిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago