Bandla Ganesh : లోకేష్‌ని త‌క్కువ అంచ‌నా వేశాను.. ఆయ‌న ఏంటో చెప్పిన బండ్ల గ‌ణేష్‌..

Bandla Ganesh : సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటారు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, వైసీపీ నేత‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జ‌గ‌న్, రోజా, నాని వ‌ల‌న లోకేష్ ఇప్పుడు నిజ‌మైన పొలిటీష‌న్ అయ్యాడ‌ని, వారికి ధ‌న్య‌వాదాలు చెప్పాల‌ని బండ్ల గ‌ణేష్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఎవర్నో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నానని.. లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన సమయంలో ఏం చేస్తాడులే అని తనకు అనిపించిందని నిర్మా త బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు న్నారు. తన తల్లి అంటే ఎంత గౌరవమో.. నారా భువనేశ్వరి అంటే తనకు అంతే గౌరవం ఉందన్నారు.

భువ‌నేశ్వ‌రి తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి అయిన చాలా సింపుల్‌గా ఉంటార‌ని గుర్తు చేశారు. తనది టీడీపీ కాదని.. చంద్రబాబుతో సంబంధం లేదు.. తనకు వాళ్లతో ఎలాంటి లబ్ధి కూడా అవసరం లేదన్నారు. భువనేశ్వరి మాట్లాడే పద్దతి, నడిచే విధానం, ఆవిడ క్రమశిక్షణను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అయితే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో.. 20 రోజులో, 30 రోజులో చేసి వెనక్కు వస్తారని నేను అనుకున్నా..ఆ మహాతల్లి భువనేశ్వరి ఎంత బాధపడుద్దో అని అనుకున్నా అని బండ్ల గ‌ణేష్ త‌న మ‌న‌సులో మాట చెప్పారు.

Bandla Ganesh on lokesh waht he said
Bandla Ganesh

ఒకటో రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు గమనిస్తే లోకేష్ చాలా మారిపోయారన్నారు. రాజకీయాలపై పట్టు, జనరల్ నాలెడ్జ్, ప్రసంగాల్లో చాలా మార్పు కనిపించిందన్నారు. ఈ విష‌యంలో లోకేష్ వాళ్ల అమ్మకు, నాన్నకు థ్యాంక్స్ చెప్పకూడదని.. సీఎం జగన్, మంత్రి రోజా, కొడాలి నానిల కు థ్యాంక్స్ చెప్పాలన్నారు గణేష్. వాళ్లు తిట్టబట్టే లోకేష్ పౌరుషంతో ఇలా మారిపోయారని తన ఫీలింగ్ అన్నారు. గతంలో లోకేష్‌ను ఎన్నో అన్నారు, విమర్శించారని.. టీడీపీకి అధికారం వస్తదో రాదో తెలియదు కానీ.. లోకేష్ సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అయ్యారని.. మంచి భవిష్యత్ కూడా ఉంటుందన్నారు. ఇక ప‌వ‌న్ అన్నీ వ‌దిలేసి రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ఆయ‌న తప్పు మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు హుందాగా విమర్శించాలి కానీ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దని అన్నారు బండ్ల గ‌ణేష్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago