Vamika : ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకి 2021 జనవరి 11న వామిక జన్మించింది. ఇప్పటివరకూ ఆమె ఫొటోలను ప్రపంచానికి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ చూపించలేదు. పాప ప్రైవసీని గౌరవించాలని.. ఆమె ఫొటోలు తీయవద్దని విరుష్క జోడి మీడియాకు పదే పదే విజ్ఞప్తి చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కూడా విమానాశ్రయంలో కూడా కొందరు ఫొటోలు తీయగా.. వాటిని డిలీట్ చేయాలని కోహ్లీ సూచించాడు. తమ కూతురు ముఖాన్ని దాచేయాలని విరాట్ -అనుష్కలు ఎంత ప్రయత్నించిన కూడా ఏదో ఒక విధంగా పాప పిక్స్ బయట పడుతున్నాయి.
తాజాగా తన తల్లితో వామిక ఆడుకుంటున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో వామిక చాలా క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ వారెవ్వా అనిపిస్తుంది. కోహ్లీ కూతురిని చూసి మురిసిపోతున్నారు. వామిక పేరు చాలా బాగుందని అప్పట్లో నెటిజన్స్ కామెంట్ చేశారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి (దుర్గాదేవి) మరోపేరు అది. స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబింబించే పేరు వామిక. అర్ధనారీశ్వర రూపంలో శివుడు కుడి వైపు ఉంటే.. ఎడమ వైపు పార్వతి దేవి ఉంటారు. ఎడమ అంటే వామ అని అర్థం. అందుకే పార్వతిని వామిక అంటారు. ఆ పేరును కూతురికి పెట్టారు విరుష్క జంట.
అలాగే విరాట్ – అనుష్క పేర్లు కలిసేలా కూడా ఈ పేరు ఉండడం విశేషం. విరాట్‌లోని మొదటకి అక్షరం ‘వి’.. అనుష్క పేరులోని చివరి శబ్దం ‘క’ ఉండేలా గారాల పట్టి పేరు పెట్టారు.కూతురిని చాలా ఆప్యాయంగా చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు విరుష్క దంపతులు. పాప పుట్టిన తర్వాత అనుష్క సినిమాలకి పూర్తిగా దూరమైంది. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ రెండో టెస్ట్ ఆడడం అనుమానంగానే ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…