Balakrishna : నందమూరి బాలకృష్ణని బాలయ్య అని అందరు ముద్దుగా పిలుచుకుంటారు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉంటూనే అన్‌స్టాపబుల్ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డి అనే టైటిల్‌తో మంచి హిట్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తన 108వ సినిమా చేస్తున్నారు. బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మాత్రమే కాదు రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు.అయితే హిందూపూర్ ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్నారు.
ఇక బాలయ్యను ఆయన అభిమానులే కాదు. తెలుగు సినీ లవర్స్ కూడా చాలా ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. యువరత్న అని, నందమూరి నటసింహం అని, బాక్సాఫీస్ బొనంజాఅని, గోల్డెన్ స్టార్ అని, బాలయ్యఅని, లయన్ అని ఇలా చాలా పేర్లే బాలకృష్ణకు ముద్దుపేర్లుగా ఉన్నాయి. ఇక ఆయన్ను ఎక్కువుగా బాలయ్య అని పిలిచేవాళ్లే ఉంటారు. ఆ తరం జనరేషన్ నందమూరి అభిమానుల నుంచి నేటి తరం అభిమానుల వరకు బాలయ్యే అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల క్రికెట్ స్టేడియంలోను అలానే ఇతర హీరోల సినిమాల ఫంక్షన్స్‌లోను జై బాలయ్య అనే నినాదం మార్మోగుతుంది.
రీసెంట్ బ్లాక్‌బస్టర్ అఖండ అయితే ఏకంగా జై బాలయ్యా సాంగ్ పెట్టడం.. ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలోను జై బాలయ్య పాట పెట్టడం మనం చూశాం. అసలు బాలకృష్ణకు బాలయ్య అన్న ముద్దు పేరు ఎలా వచ్చింది ? దీని వెనక స్టోరీ ఏంటో చూస్తే ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది. బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్ అంటేనే వెరీ ఇంట్రస్టింగ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. ముందు లారీడ్రైవర్ ఆ తర్వాత రౌడీఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు వచ్చాయి. లారీడ్రైవర్ సినిమా టైంలో జొన్నవిత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్ బి. గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి.. పాటలో మాత్రం బాలయ్య అన్న పదం వినిపించాలని చెప్పారట. వెంటనే జొన్నివిత్తుల బాలయ్య బాలయ్యా.. గుండెల్లో గోలయ్యా జో కొట్టాలయ్యా అని రాశారు. ఇలా బాలయ్య అన్న పదమే ఆయన ముద్దుపేరుగా స్థిరపడిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…