Dhanush Sir Movie : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో నేరుగా చేసిన చిత్రం సార్… ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకకాలంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.”జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్” కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో అలరించింది. సమాజంలో విద్యావ్యవస్థ పై జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది ఈ సినిమా.. ఇప్పటికే చాలామంది పెద్దలు విద్య పేరిట సామాన్య ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని.. వారిని మరింతగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని వెంకీ చాలా చక్కగా చూపించారు.
ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా, సార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ గతంలోనే దక్కించుకున్నప్పటికీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.ఈనెల అంటే మార్చి 22 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈవిధంగా సార్ మూవీ మేకర్స్ డీల్ కుదిరించుకున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంది. అంతేకాదు 500 మంది విద్యార్థులకు ఈసారి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు థియేటర్ నిర్వాహకులు. ఫ్యామిలీ ఆడియన్స్ ..ఇటు యువత.. అటు చిన్న పిల్లల సైతం ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకి మరింత ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు. ఒక ధనుష్ శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…