Balakrishna : 1999లో బాలయ్య నటించిన సుల్తాన్ సినిమా పెద్ద హిట్ కాకపోయిన ఈ సినిమా వెనక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కృష్ణలు నటించడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ గా, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సీబీఐ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమా కోసం దర్శకుడు శరత్ తో పాటు రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇందులో ముగ్గురు హీరోల్లో ఎవరి ఇమేజ్‌కి తగ్గట్టు వారి పాత్రలను క్రియేట్ చేశారు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఒక పవర్ పుల్ ఒక పవర్ పుల్ సీబీఐ ఆఫీసర్‌గా, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎవరైతే బాగుంటారని చాలా చర్చలు జరిపారట.
ఆ సమయంలో సీబీఐ ఆఫీసర్ గా కృష్ణంరాజుని పోలీస్ ఆఫీసర్‌గా కృష్ణ తీసుకుంటే బాగుంటుందని సూచించారట. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన కృష్ణ, కృష్ణంరాజుల పార్ట్‌ని ముందుగా తెరకెక్కించాలని బాలయ్య సూచించాడట. సినిమా షూటింగ్ అండమాన్ దీవుల్లో ఉండడంతో సరదాగా మన ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినట్టు ఉంటుందని అనుకొని కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వాళ్ల ఫ్యామిలీస్‌ని వెంట బెట్టుకొని అందరూ అండమాన్ వెళ్లారట. అయితే అక్కడ వాతావరణం, లొకేషన్లు బాగున్నప్పటికీ ఉండడానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ తప్ప వేరే ప్రాంతం ఏమి లేదట.
అయితే అక్కడ తినడానికి తిండి దొరకని పరిస్థితి. ఆ సమయంలో చేసేది ఏమి లేక బిస్కేట్లు, చిన్న చిన్న చిరుతిండ్లతో కాలం గడిపేశారట. ఇక తర్వాతి రోజు బయట ఎక్కడి నుంచో బియ్యం కూరగాయలు తెప్పించారట. వాటితో అద్భుతంగా విజయ నిర్మల వంట చేసి పెడితే అందరూ హ్యాపీగా తిన్నారట. సముద్రంలోని చేపలని వేటాడీ మరీ పట్టుకొచ్చి విజయ నిర్మలకి ఇచ్చాడట బాలయ్య. ఆమె వాటితో చేపల పులుసు పెట్టిందట. ఆ చేపల పులుసు అదిరిపోవడంతో లొకేషన్‌లోకి కూడా పట్టుకెళ్లారట. సినిమా టీం అంతా విజయనిర్మల వంటని హ్యాపీగా ఆస్వాదించారట. అలా మొత్తానికి ఆ మూవీ షూటింగ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…