భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లోనే కాక ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ క్రమంలోనే పసుపుతో ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జామ ఆకులు కొన్నింటిని, పసుపు కొంత తీసుకుని రెండింటినీ బాగా కలిపి ముద్దగా నూరాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు పోతాయి.
పసుపును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాని వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మాయమవుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరగబెట్టాలి. అందులోంచి ఆవిరి బాగా వస్తున్నప్పుడు పాత్రను దించి అందులో కొంత ఉప్పు, పసుపును వేసి వచ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో దగ్గు, జలుబు వంటివి వెంటనే తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరి తిత్తులు, ఇతర శ్వాస కోశ సమస్యలు కూడా పోతాయి. గురక ఉన్నవారు ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక పసుపు కొమ్ము తీసుకుని దానికి వేడి నీళ్లు కలిపి ముద్దగా నూరాలి. దీన్ని తలకు పట్టించి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తల తిరుగుడు తగ్గుతుంది. వేపాకు, పసుపు రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా నూరి మిశ్రమంగా చేయాలి. దీన్ని శరీరానికి పట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. కొద్దిగా వేప నూనె తీసుకుని దాన్ని వేడి చేయాలి. అందులో పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని గాయాలు, దెబ్బలు, కురుపులు వంటి వాటిపై రాస్తే వెంటనే అవి తగ్గుముఖం పడతాయి. ఏవైనా కీటకాలు మన శరీరాన్ని కుట్టినా లేదంటే పాకినా అయ్యే దురద, పుండ్లపై కూడా దీన్ని రాయవచ్చు. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను రోజూ తోముకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి, వాపులు తగ్గుతాయి. పిప్పి పన్ను ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమ భాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది. పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యం పిండిని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 30 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ బారిన పడి నల్లగా అయిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది.
పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి తాగితే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి. విరేచనాలకు, కీళ్ల నొప్పులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. పసుపు, పెరుగు, గంధంలను సమ భాగాల్లో తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…