ప్రపంచవ్యాప్తంగా శివాలయాలు ఎన్నో ఉన్నాయి. అనేక దేశాల్లోనూ ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో చాలా పురాతనమైన శివాలయాలను మనం చూడవచ్చు. అయితే మనం ఏ శివాలయానికి వెళ్లినా సరే.. మనకు శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తాడు. ఆయనకు రూపం ఉండదు. ఇక శివున్ని దర్శించుకుంటానికి ముందు గర్భగుడి ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి ముందుగా శివలింగాన్ని చూడాలి. ఆ తరువాతే గర్భగుడిలోకి వెళ్లాలి. ఇలా ఎందుకు దర్శించుకోవాలనే విషయాన్ని పండితులు తెలియజేస్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని వారు చెబుతున్నారు.
సాధారణంగా మనం ఏ దేవున్ని లేదా దేవతను దర్శించుకున్నా నేరుగా గర్భగుడిలోకి వెళతాం. కానీ శివున్ని మాత్రం ముందుగా నంది కొమ్ముల నుంచి దర్శించుకోవాలి. ఆ తరువాతే గర్భగుడిలోకి వెళ్లాలి. ఇలా ఎందుకు చేయాలంటే.. శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆయనకు రూపం ఉండదు. ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి. శివుడు లయ కారకుడు. ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
కనుక శివాలయంలో ముందుగా శివున్ని నంది కొమ్ముల నుంచి చూసి దర్శించుకున్నాకే గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఇక నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దర్శనం చేసుకునేటప్పుడు.. నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంతరం మన మనస్సులో ఉన్న కోరికలతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రాలు చెప్పాలి. అలా చెబుతూ.. నంది కొమ్ముల నుంచి చూస్తూ.. శివలింగాన్ని దర్శించుకోవాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరుసటి జన్మ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు. కనుక శివాలయంలో శివున్ని దర్శించుకునేటప్పుడు ముందు తెలిపిన విధంగా చేస్తే మంచిది. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…