Waltair Veerayya : వివాదంలో వాల్తేరు వీర‌య్య టైటిల్ సాంగ్.. యండ‌మూరి, చంద్రబోస్ మ‌ధ్య మాట‌ల తూటాలు..

Waltair Veerayya : చిరంజీవి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బాబీ తెర‌కెక్కించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. జనవరి 13 వాల్తేరు వీరయ్య తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండు పాటలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గ విడుదల చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ సైతం అదరగొట్టాడు డీఎస్పీ. అయితే ఈ పాట రాసిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌పై రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మండిపడ్డారు. పాట రాసిన వ్యక్తి ఏ పురాణాలు చదివారు, అస‌లు చంద్రబోస్‌కు ఏ సంప్రదాయం తెలుసునంటూ యండమూరి ప్రశ్నించారు.

దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబోస్ స్పందించారు. విరోధాభాషలంకారంలో అర్ధాన్ని వివరించారు . అధ్యయనం చేయాల్సిన పాటను అవమానిస్తారా అని చంద్రబోస్ కౌంటరిచ్చారు. మరి దీనిపై యండమూరి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. అయితే ఈ పాట `తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ణుడు` అంటూ సాగే ఈ పాట‌ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటని చంద్రబోస్‌ రాశారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు.

Waltair Veerayya title song controversy chandrabose and yandamuri
Waltair Veerayya

టైటిల్ సాంగ్‌ని అనురాగ్‌ కులకర్ణ అలాప్‌, పవిత్ర చారి ఆలపించ‌గా, బ్రాస్‌ ఆర్కేస్ట్రా సంస్థ బ్యాంకాక్‌ కి చెందిన ఆర్కేస్ట్రా బృందాలతో కలిసి పనిచేయడం విశేషం. యాక్షన్ సీక్వెన్స్ లో ఈ పాట వచ్చేలా ఉందని అర్థం అవుతోంది. ఆన్ లైన్ లో మెుదట పాటను విడుదల చేశారు. కాసేపటికి యూట్యూబ్ లోనూ అప్ లోడ్ చేశారు. ముందుగా ​ చిరంజీవి ఫొటోను చిత్ర యూనిట్​ విడుదల చేయ‌గా, ఇందులో చిరు మాస్​ లుక్​లో సూపర్ గా కనిపిస్తున్నాడు. ఇందులో రవితేజ కీలక పాత్రలో న‌టించి మెప్పించ‌నున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago