మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, మాస్ మహరాజా ప్రధాన పాత్రలలో బాబీ తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్య . ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తొలిరోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ చిత్రం 3 రోజుల్లోనే 108 కోట్లను రాబట్టడం జరిగింది. ఈ కథకి చిరంజీవితో పాటు రవితేజ కూడా తోడవడంతో, సెకండాఫ్ నుంచి ఎమోషన్ ను కూడా తోడుచేసుకుని నడుస్తుంది. ఇక దేవిశ్రీ పాటలు ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో కలెక్షన్ తో దూసుకెళుతోంది. అటు యుఎస్ఏ లో వాల్తేరు వీరయ్య 2 మిలియన్ డాలర్స్ కి చేరువయింది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల పాటు బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య ప్రభంజనం ఖాయం అని తెలుస్తుంది. అయితే కథలో కొత్తదనం లేకపోయినా.. ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ తో మ్యాజిక్ చేసినట్టు తెలుస్తుంది. సెకండాఫ్ లో డబ్బింగ్ లో ఫాల్ట్ ఉందా లేక మరెక్కడైనా లోపం జరిగిందనేది తెలియదు. కానీ.. డైలాగ్స్, మ్యూజిక్ సరిగ్గా అర్థం కాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
డబ్బింగ్ లోపాలను సరిచేసి.. లైవ్ డబ్బింగ్ వాయిస్ లను మార్చేస్తే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందని కొందరు అంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సెకండాఫ్ లో డైలాగ్స్, పాటలు సరిగ్గా వినిపించకపోవడం అనేది సినిమా కలెక్షన్స్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. అవి సరి చేస్తే వీరయ్య దూకుడు మరింత ఉంటుందని అంటున్నారు. సినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, మైమ్ గోపి, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్, క్యాథరీన్ త్రెస్స తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…