ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎంత వాడివేడిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రాజకీయాలలో ఇటీవల హైపర్ ఆది ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని స్టేజ్‌పై సందడి చేసి స్పీచ్‌లు ఇచ్చిన హైపర్ ఆది.. మళ్లీ జై జనసేన.. జై పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ముందు వీరలెవల్లో స్పీచ్ ఇచ్చి ‘వీరమల్లు’ దీవెనలు పొందాడు. ఆది తన స్థాయికి మించి మాట్లాడాడని.. ఏదో పవన్ కళ్యాణ స్టేజ్‌పై ఉన్నాడు కదా.. చేతిలో మైక్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు పేలాడని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ హైపర్ ఆదికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.
మెగా ఫ్యామిలీ అంటే భయంతో చాలా మంది కుటుంబంతో ఉన్నారని.. ప్రేమతో ఎవరూ లేరని అన్నారు. టీవీ షోలు, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నారని.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండాపోతాయని భయంతో వారు అలా మాట్లాడతున్నారన్నారు. నిజంగా మెగా ఫ్యామిలీ అంటే ప్రేమ ఉంటే.. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. భయం వేరు.. ప్రేమ వేరు అని రోజా చెప్పుకొచ్చింది.
భయంతో ఎప్పటికీ ఎక్కువ కాలం బ్రతకలేరు. మంత్రులకు శాఖలు తెలియవంటే.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారదా, నేను ఎలా గెలిచాం. మేము సినిమా వాళ్ళమే కదా! ప్రజలకు మా వల్ల మంచి జరిగింది.. కాబట్టి మమ్మల్ని గెలిపించారు. అదే జనాలు మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు? ఎవరు ఎలాంటివారో జనాలకు తెలుసు” అని రోజా స్పష్టం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నాం. అందుకే మమ్మల్ని గెలిపించారు. ప్రజలు చాలా తెలివైనవారు. మనం అనుకున్నంత అమాయకులైతే కాదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎలా తిట్టుకున్నారో మనం అందరం చూశాం. వాళ్లకు నీతినిజాయితీ లేదు.. అని రోజా చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…